బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమై 'మురసు' తుఫాన్‌గా మారింది. ఇది గంటకు 20 కి.మీ వేగంతో ఏపీ తీరం వైపు కదులుతోంది. రేపటికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్లుండి నెల్లూరు-నరసాపురం మధ్య ఈ తుఫాన్ తీరం దాటే సూచనలు ఉన్నాయి. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 100-120 కి.మీ వేగంతో వీచే ప్రమాదం ఉండటంతో, ఏపీ తీర ప్రాంతాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕