తీరం వైపు దూసుకువస్తున్న 'మొంథా' తుఫాను

మొంథా తుఫాను ఆంధ్రతీరం వైపు దూసుకువస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం విశాఖకు 790 కి.మీ, కాకినాడకు 729 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. ఈ సమయంలో గరిష్టంగా 110 - 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరం దాటిన తర్వాత పెనుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

సంబంధిత పోస్ట్