బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా బలపడింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తుఫాన్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.