ఆసియా గేమ్స్‌కు తుఫాన్ ముప్పు

జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. డుజువాన్ తుఫాన్‌ ప్రభావంతో సెప్టెంబర్‌ 21న భారీ వర్షాలు, బలమైన గాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే వర్షాల కారణంగా కొన్ని పోటీలు ఆలస్యమయ్యాయి. పరిస్థితులను నిర్వాహకులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సాధారణ వర్షపాతం ఉంటే పోటీలు కొనసాగుతాయని, భారీ వర్షాలు లేదా వరదలు వస్తే అత్యవసర చర్యలు చేపట్టి క్రీడాకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕