గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ గాలివానల బీభత్సంతో రాష్ట్రంలో దాదాపు 100 మందికిపైగా మృత్యువాత పడ్డారు. పలు జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రకృతి వైపరీత్యం రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని కలిగించింది.