షూటింగ్ సెట్‌లో పేలిన సిలిండర్‌.. ఒకరి మృతి (వీడియో)

చెన్నైలోని ఒట్టేరి బిన్నీ మిల్ ప్రాంగణంలో ఎస్‌జే సూర్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్‌ సెట్‌లో సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షూటింగ్‌ పనుల్లో పాల్గొన్న మదన్ (25) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పది మందికి పైగా గాయపడగా, వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్