డెయిరీ ఫామ్‌లో పనిచేసే వ్యక్తి హత్య.. ముగ్గురి అరెస్ట్

AP: కృష్ణా జిల్లా పునాదిపాడు శివారులోని ఓ డెయిరీ ఫామ్‌లో రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు బిహార్‌కు చెందిన రాకేశ్ కుమార్, మనీష్ కుమార్, అనీశ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. గతంలో రాకేశ్ డెయిరీలోనే పనిచేసేవాడు. అతను నిర్లక్ష్యంగా ఉంటున్నాడనే కారణంగా రాకేశ్‌ను పనిలో నుంచి తొలగించారు. అయితే ఆ పనిలోంచి బయటకు రావాలని అనిల్‌ను రాకేశ్ బెదిరించాడు. అనిల్ అక్కడే పనిచేస్తుండటంతో రాకేశ్ పగబట్టి స్నేహితులతో కలిసి హత్య చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕