మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా మహారాజ్‌గంజ్ గ్రామంలో, ఆలయానికి గోధుమల విరాళం ఇవ్వలేదన్న కారణంతో ఒక దళిత కుటుంబాన్ని స్థానిక పెత్తందారులు దారుణంగా కొట్టారు. బాధితుల ఇంటికి వెళ్లి గోధుమలు డిమాండ్ చేయగా, నిస్సహాయత వ్యక్తం చేసిన కుటుంబంపై కర్రలు, రాడ్లు, ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా ఐదుగురు సభ్యులు గాయపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.