TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ భూముల పక్కన ఉన్న 325 సర్వే నంబర్ భూములను కొలుస్తూ దళిత రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరుతో దళిత రైతులు ఆవేదన చెందుతున్నారని, తెలంగాణ రైతులు సాగునీరు, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి రైతులకు సమస్యలు రాకుండా పాలన చేయాలని సూచించారు.