హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నల్లగొండ జిల్లా పరిధిలోని 160 కిలోమీటర్ల ఈ హైవేపై నెలకు సగటున 113 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని 51 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గత ఐదేళ్లలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 8,196 ప్రమాదాల్లో 3,673 మంది మృతిచెందారు. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, భద్రతా లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. రూ.300 కోట్లతో మరమ్మతు పనులు కొనసాగుతున్నా, ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.