సీఎం రేవంత్‌కు దాసోజు శ్రవణ్‌ సవాల్‌ (VIDEO)

TG: ఖైరతాబాద్‌ ఉపఎన్నికను ఎదుర్కొనే ధైర్యం లేకే ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను సుప్రీంకోర్టుకు తీసుకెళ్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. హైకోర్టు తీర్పు తర్వాత రాజీనామా చేసి మళ్లీ ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేస్తానన్న దానం నాగేందర్‌.. 24 గంటలు గడవకముందే సుప్రీంకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడాన్ని ఆయన ప్రశ్నించారు. దానం వ్యవహారం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని, ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందనే భయంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థల వెనుక దాక్కోకుండా ఉపఎన్నికను ఎదుర్కోవాలని రేవంత్‌కు సవాల్‌ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕