‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయకుడు’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ను జనవరి 2న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో వస్తున్న చివరి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్