ఖర్జూరం, బాదంతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు

శీతాకాలంలో ఖర్జూరాలు, బాదం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఖర్జూరాలలో సహజ చక్కెరలు, ఇనుము, ఫైబర్ పుష్కలంగా ఉండి తక్షణ శక్తిని అందించి, జలుబు, అలసట, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ E ఉండి శరీరాన్ని వెచ్చగా, చర్మాన్ని తేమగా ఉంచుతాయి. బలహీనంగా అనిపిస్తే ఖర్జూరం, దీర్ఘకాలిక బలం కోసం బాదం మేలు. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖర్జూరాలను మితంగా తీసుకోవాలి. వైద్య సలహా తీసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్