బంగారు నగల కోసం అత్తను హతమార్చిన కోడలు

TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో బంగారు నగల కోసం కోడలు అత్తను హత్య చేసిన విషాద ఘటన చోటుచేసుకుంది. సీతాయిపల్లి గ్రామానికి చెందిన కావటి రుక్మవ్వ(75)ను, ఆమె రెండో కోడలు కోటవ్వ శనివారం రాత్రి ఇంట్లోకి చొరబడి బండరాయితో తలపై బాది హత్య చేసింది. అనంతరం రుక్మవ్వ మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు తీసుకొని వెళ్లింది. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో కోటవ్వ నేరం అంగీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్