సర్పంచ్ ఎన్నికల బరిలో అత్తాకోడళ్లు

TG: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హిరాపూర్ గ్రామపంచాయతీలో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అదే మండలంలోని ఏమాయికుంట గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు సర్పంచ్ ఎన్నికలో బరిలో నిలిచారు. లఖన్ సింగ్, కుబేర్సింగ్, అనార్సింగ్ లు సర్పంచ్ పదవికి పోటీ చేశారు. దీంతో ముగ్గురు అన్నదమ్ములు, అత్తా కోడళ్లలో ఎవరు గెలుస్తారోనని ఆయా గ్రామాల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్