ఉత్తరప్రదేశ్లోని కాన్షీరామ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. శ్యామ్ సుందర్(55) అనే వ్యక్తికి 17 ఏళ్ల కుమార్తె ఉంది. అభిలాష్ సింగ్(21) అనే యువకుడితో బాలిక ప్రేమలో ఉంది. ఈ విషయం తెలిసి శ్యామ్ సుందర్ వారి ప్రేమను నిరాకరించాడు. తన ప్రేమను నిరాకరించాడనే కోపంతో తండ్రిని చంపాలని ప్రియుడితో కలిసి కుమార్తె ప్లాన్ వేసింది. తొలుత తండ్రికి నిద్రమాత్రలు ఇచ్చింది. ప్రియుడితో కలిసి తండ్రిని చంపి దుప్పట్లో మృతదేహాన్ని చుట్టేసి.. ఇంటికి తాళం వేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.