మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో ఒక యువతి తన తండ్రికి స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. వెన్నచేడ గ్రామానికి చెందిన వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందగా.. ఆయనకు కుమారులు లేకపోవడంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కుమార్తె అర్చన ధైర్యంగా ముందుకు వచ్చి, తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఆడపిల్లలు కూడా అన్ని బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలరని ఆమె చర్య నిరూపించిందని గ్రామస్తులు, బంధువులు అభినందించారు.