ముంబై మలాడ్ ఈస్ట్‌లో మూసివేసిన ఓ డే కేర్ సెంటర్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళాలు తెరిచి చూడగా లోపల కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. విచారణలో అతడు 2022 జూన్‌లో గుండెపోటుతో మృతి చెందినట్లు తేలింది. తండ్రిపై ప్రేమతో ఆయనను దూరం చేసుకోలేకపోయిన కుమార్తె.. అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కురార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.