బెంగళూరు శివార్లలోని నెలమంగళలో షాకింగ్ ఘటన జరిగింది. ఫ్రెండ్ తండ్రి వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. భావన (22) అనే యువతి నర్సింగ్ చేస్తోంది. అక్కడ పరిచయమైన ఫ్రెండ్ తండ్రి నవీన్.. తన కూతురితో మాట్లాడటానికి ఫోన్ చేస్తూ.. భావనతో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఒకసారి తీసుకున్న ఫొటోలను చూపిస్తూ.. తనని పెళ్లి చేసుకోవాలని, తనతో ఉండాలని వేధింపులకు గురి చేశాడు. దీంతో మనస్తాపం చెందిన భావన సూసైడ్ చేసుకుంది.