పుత్రికా ప్రేమ: మరణించిన కూతురి కోసం గుడి కట్టిన తండ్రి! (వీడియో)

TG: సెప్టెంబర్ 27న అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా చుక్కాయిపల్లిలో ఓ తండ్రి తన కుమార్తెపై చూపిన అపారమైన ప్రేమ అందరినీ కదిలిస్తోంది. 2024లో మెదడు సంబంధిత వ్యాధితో మరణించిన తన 13 ఏళ్ల కుమార్తె జ్ఞాపకార్థం రమేష్ అనే తండ్రి సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఒక చిన్న గుడిని నిర్మించారు. తన కుమార్తె జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉండాలనే ఆకాంక్షతో, ఆ ఆలయంలో ప్రతిరోజూ దీపారాధన చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕