ఈఎంఐ కట్టలేదని కూతురు ఫొటోలు మార్ఫింగ్

TG: ఈఎంఐ కట్టలేదని కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. HYD బోడుప్పల్ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ తన బంధువు కోసం లోన్ యాప్‌లో రుణం తీసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈఎంఐ కట్టకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. నంబర్‌ బ్లాక్‌ చేయడంతో తన పదవ తరగతి కూతురి ఫొటోలను మార్ఫింగ్ చేసి మహిళకు పంపి, రుణం చెల్లించకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕