రెండు రోజుల్లో కూతురి పెళ్లి.. అనుమానాస్పదస్థితిలో తండ్రి మృతి

AP: రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా, పిఠాపురంలోని జగ్గయ్యచెరువు ప్రాంతానికి చెందిన కావాటి చిన్నఏసు (45) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఉప్పాడ బస్టాండ్ సెంటర్ సమీపంలోని డ్రెయినేజీలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కాలువలో పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చిన్నఏసుకు ఐదుగురు కుమార్తెలు ఉండగా, ఈ నెల 8న రెండో కుమార్తె వివాహం జరగాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్