హర్యానాలోని సోనీపట్‌లో శివ్‌చరణ్ గుప్తా అనే వృద్ధుడు తన ముగ్గురు కూతుర్లను కష్టపడి చదివించాడు. వారిలో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. వృద్ధాప్యంలో ఆదరణ కరువై వృద్ధాశ్రమంలో చేరిన ఆయన, అనారోగ్యంతో మరణించినా ఒక్క కూతురు కూడా చూడటానికి రాలేదు. వృద్ధాశ్రమ నిర్వాహకుడికి రూ.5,100 పంపించి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి దహన సంస్కారాలను ముగ్గురు కూతుళ్లు వీడియో కాల్‌లో చూశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.