DCC అధ్యక్షులకు ఆరు నెలల పాటు ప్రొబేషనరీ కాలం: సీఎం రేవంత్

TG: కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు ఆరునెలల పాటు ప్రొబేషనరీ కాలం ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. వారి పనితీరుపై నివేదిక తీసుకుని, ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో నిర్ణయించాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షిని కోరారు. దీనికి ఆమె వెంటనే స్పందిస్తూ.. 'గుజరాత్‌లో 15 రోజులకు ఒకసారి DCC అధ్యక్షుల పనితీరు సమీక్షించి 3 నెలలే ఇస్తున్నాం. సీఎం ఆరునెలలు కోరారు. రాబోయే ఆరునెలలు మీకు పరీక్షా కాలం. ఇందులో పాస్ అయితే 2028లో పాస్ అవుతాం. 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని కాకపోతే మనమంతా ఉండి ఏం లాభం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్