TG: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతగిరి(మం) కొత్తగూడెంకు చెందిన భూక్య నవీన్, భూక్య ప్రసాద్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.