ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం.. పలువురికి గాయాలు (వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్