యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, వధూవరులతో సహా ఏడుగురు మృతి (వీడియో)

యూపీలోని బిజ్నోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధాంపూర్‌కు చెందిన మగ పెళ్లివారి కుటుంబం జార్ఖండ్‌కు చెందిన వధువుతో కలిసి తమ ఇంటికి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం కారు, ఓ టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వధూవరులతో సహా ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్