ఇరాన్‌తో కుదుర్చుకోబోయే కొత్త అణు ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠిన నిబంధనలు ఉండాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఒప్పందం 2015 నాటి ఒబామా హయాం ఒప్పందంతో పోలికలు కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో 2015 ఒప్పందాన్ని విమర్శించిన ట్రంప్, ఇరాన్‌కు ప్రయోజనం చేకూర్చిందని, అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోలేదని ఆరోపించారు. తాజా చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణలు, యురేనియం నిల్వల నిర్వహణ, హోర్ముజ్ జలసంధి అంశాలపై అమెరికా అదనపు షరతులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.