‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’తో మరో విజయం సాధించారు. ఇటీవల జగపతిబాబు హోస్ట్‌గా ఉన్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో ఆమె పాల్గొని, ‘డియర్ కామ్రేడ్’ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక–విజయ్ దేవరకొండ ప్రేమ ఆ సినిమా నుంచే మొదలైందని అభిమానులు భావిస్తున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం, పెళ్లి వార్తలు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ధృవీకరించలేదు.