TG: వాట్సాప్‌లో టెన్త్ పేపర్ లీక్ అయిన ఘటనలో నకిరేకల్‌కు చెందిన విద్యార్థినిని డీబార్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో తన ప్రమేయమేమీ లేదని, తనను అన్యాయంగా డీబార్ చేశారని సదరు విద్యార్థిని ఝాన్సీరాణి కన్నీటి పర్యంతమైంది. పరీక్ష రాస్తుండగా కిటికీ వద్దకు వచ్చిన కొందరు బెదిరించి పేపర్ ఫొటో తీసుకున్నారని వాపోయింది. తనపై డీబార్ ఎత్తివేసి మళ్లీ పరీక్ష రాయనీయకుంటే ఆత్మహత్యే శరణ్యమని కన్నీళ్లు పెట్టుకుంది.