TG: ఆదిలాబాద్ రిమ్స్‌లో ముగ్గురు చిన్నారులు మృతి అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. గాయపడిన మిగతా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. పిల్లల వార్డులో కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర ఘటన జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.