సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష విధించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మసీదులో అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సౌదీ అధికారులు ఈ శిక్షను ప్రకటించినప్పటికీ, అసలు ఆ చర్య ఏమిటో స్పష్టత ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు వీరు నుదుటిపై ముద్దు పెట్టుకున్నందుకే ఇంతటి కఠిన శిక్ష వేశారని పేర్కొంటుండగా, ఈ వార్తలపై మరింత స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.