TG: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. కల్తీ కల్లు వల్ల అస్వస్థతకు గురై, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాధితుడు గంగారాం(70) మృతి చెందారు. కల్తీ కల్లు తాగడం వల్ల 51 మంది ఆసుపత్రిలో చేరగా, ఇప్పటికీ 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో నాలుగు కల్తీ కల్లు తయారీ కేంద్రాలపై కేసులు నమోదు చేశారు.