వంతెన కూలిన ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య

గుజరాత్‌లోని వడోదర సమీపంలో మహిసాగర్ నదిపై వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. బ్రిడ్జి శిథిలావస్థకు చేరడం, భారీ వర్షాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు అంచనాకు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన నలుగురు ఇంజినీర్లపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది.

సంబంధిత పోస్ట్