TG: మంచిర్యాల జిల్లా నస్పూర్లో లారీ- ఆటో ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. నస్పూర్ గేట్ వద్ద బైక్ అడ్డు రావడంతో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి పక్క రోడ్డులోకి దూసుకెళ్లడంతో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. మృతులను మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.