AP: అనకాపల్లి(D) కోటవురట్ల(M) కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం హోం మంత్రి, జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.