పుణె కల్తీ మద్యం ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

పుణెలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన 21 మందిని సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు ఈ నకిలీ మద్యం దందాకు సంబంధించి 22 మందిని అరెస్ట్ చేశారు. ఈ దందా భీవండీ కేంద్రంగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్