TG: బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ప్రకటించారు. జగిత్యాలలో కేటీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ''బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తే.. రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చు. కొద్ది నెలలుగా చాలా క్షోభ అనుభవించాను. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు.. భావోద్వేగానికి గురయ్యాను. శేష జీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. బీఆర్‌ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేశారు. కానీ ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచింది’’ అని తెలిపారు.