డెకాయిట్ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్

పలుమార్లు వాయిదా పడిన 'డెకాయిట్' సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. రొమాంటిక్ రివేంజ్ డ్రామాగా ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలుగా ఉంది. సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, చిత్ర బృందం వివరణ ఇచ్చి వారిని సంతృప్తి పరిచినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్