తీవ్ర విషాదం.. కారులోనే ఇరుక్కుపోయిన మృతదేహాలు

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృత దేహాలు కారులోనే ఇరుక్కుపోగా పోలీసులు శ్రమించి బయటికి తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్