టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్‌కు చెందిన మూడు క్రికెట్ బ్యాట్లు ప్రాక్టీస్ సమయంలో చోరీకి గురయ్యాయి. ఈ మూడు బ్యాట్ల విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని ఆయన సోషల్ మీడియా వీడియోలో తెలిపారు. బ్యాట్లు తీసుకెళ్లిన వ్యక్తి వాటి విలువ తెలియకపోవచ్చని, టెన్నిస్ బాల్‌తో ఆడేందుకు ఉపయోగించవచ్చని చాహర్ సరదాగా వ్యాఖ్యానించారు. డబ్బులు కావాలంటే అడిగితే ఇచ్చేవాడినని, బ్యాట్లు తిరిగి దొరకకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పారు. అవసరమైతే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీని సంప్రదిస్తానంటూ చమత్కరించారు.