లార్డ్స్ స్టేడియంలో జూలై 10 నుంచి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత పేసర్ దీపక్ చాహర్ నెట్స్‌లో టీమిండియా బ్యాటర్లపై బౌలింగ్ చేస్తున్న దృశ్యం కనిపించింది. వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి లండన్ వెళ్లిన చాహర్.. జట్టు ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడు. లార్డ్స్ పిచ్ స్వింగ్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లు ఎక్కువ సమయం సాధన చేశారు.