రెండోసారి తల్లి కాబోతున్న నటి దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీపై గతంలో వచ్చిన ట్రోలింగ్‌కు పరోక్షంగా సమాధానమిచ్చారు. భర్త రణ్వీర్ సింగ్, కుమార్తె దువాతో కలిసి ఆమె తాజాగా మేటర్నిటీ ఫొటోషూట్ చిత్రాలను పంచుకున్నారు. దీనిపై ఓ కంటెంట్ క్రియేటర్ స్పందిస్తూ.. మహిళల గర్భధారణపై ఊహాగానాలు చేయడం, శరీరాకృతిని బట్టి ప్రెగ్నెన్సీని నకిలీగా పేర్కొనడం ఆపాలని కోరారు. ఈ పోస్ట్‌కు దీపిక లైక్ చేయడంతో అది వైరల్‌గా మారింది.