ఎన్నికల్లో ఓటమి.. మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని శపథం చేసిన ఓ కార్యకర్తకు చుక్కెదురైంది. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పతనంథిట్ట మున్సిపాలిటీలో LDF గెలుస్తుందని, ఓడితే మీసాలు తీయించుకుంటానని కార్యకర్త బాబు వర్గీస్ సవాల్ చేశాడు. కానీ అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UDF విజయం సాధించింది. దీంతో బాబు స్థానిక సెలూన్ షాపుకెళ్లి మీసాలు తీయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్