సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన ఓటమి

TG: మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌కు సొంత గ్రామంలోనే చుక్కెదురైంది. ఆయన వదిన, కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా కౌసల్య, మహబూబాబాద్‌ మండలం సోమ్లా తండాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత చేతిలో 27 ఓట్లతో ఓటమి పాలయ్యారు. కౌసల్య విజ్ఞప్తితో అధికారులు రీకౌంటింగ్‌ను చేపట్టారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్