పోషకాలు లోపిస్తే వచ్చే అనర్థాలివే

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందాలి. అవి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక శరీరంలో ఐరన్ లోపం వల్ల ఎనీమియా వస్తుంది. అలసట, గుండెల్లో నొప్పితో పాటు శరీరం బలహీనంగా మారుతుంది. అయోడిన్ లోపంతో హైపోథైరాయిడిజమ్‌తో పాటు గాయిటర్ సమస్య తలెత్తుతుంది. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, చూపు మందగించటం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో విటమిన్ డి తగ్గితే కీళ్ల నొప్పులు, అలసట వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్