ఇటీవల జరిగిన కారు పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఘటనాస్థలిలో ఇప్పటికే NIA, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.