ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉదయం 11 గంటలకు ఉన్నత స్థాయి అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఘటనపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిపై అధికారుల నుంచి పూర్తి వివరాలను అమిత్ షా తెలుసుకోనున్నారు. భద్రతా చర్యలను మరింత బలపరిచే దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.