ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్.. 'పెద్ది' షూటింగ్‌కు బ్రేక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్‌కు ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగా బ్రేక్ పడింది. నవంబర్ 17న రెడ్ ఫోర్ట్ సమీపంలో షూటింగ్ జరగాల్సి ఉండగా, భద్రతా ఆంక్షల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో 'కాక్‌టైల్ 2' షూటింగ్ కూడా వాయిదా పడింది. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం, భద్రతా ఉద్రిక్తతలు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 'పెద్ది' సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్