ఢిల్లీ బాంబు పేలుడు ఆత్మాహుతి దాడి కాదా ?

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 'కారు బాంబు పేలుడు' ఆత్మాహుతి దాడి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సహచరులను పోలీసులు పట్టుకోవడంతో ఉగ్రవాదులు భయంతో ఆ బాంబు పేల్చి ఉంటారని ఢిల్లీ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. పేలిన బాంబు కూడా పూర్తిగా తయారైన IED కాదని తెలిపాయి. ఆత్మాహుతి దాడి అయితే ఆ ప్రాంతంలో పెద్ద గుంత పడి ఉండేదని, కారు కూడా నేరుగా టార్గెట్ వైపు దూసుకెళ్లేదని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్